కలుపు మందు అమ్మితే కఠిన చర్యలు తప్పవు
గార్ల ,పెన్ పవర్, ఆగస్టు 7: నిషేధిత కలుపు మందు పారాక్వాట్ నిల్వ ఉంచినా, రైతులకు విక్రయించినా సంబంధిత పురుగు మందుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే షాపుల లైసెన్సులను సైతం రద్దు చేస్తామని మహబూబాబాద్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) అజ్మీరా శ్రీనివాస్ రావు హెచ్చరించారు.శుక్రవారం గార్ల మండలంలోని పుల్లూరు గార్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి రామారావుతో కలిసి పురుగు మందులు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో నిషేధిత పారాక్వాట్ కలుపు...