కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్‌ పథకం కొనసాగించాలి

  గార్ల, పెన్‌పవర్, ఆగస్టు 16: కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్‌ పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ సోమవారం గార్లలో ధర్నా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపిటిసి శీలం శెట్టి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు, ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ నాయక్‌ ఆదేశాల మేరకు ఉదయం 10:30 గంటలకు గార్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్‌ పథకాన్ని...