కాజులూరులో హత్యాయత్నం కేసులో.. 8మంది అరెస్ట్

కాజులూరు, పెన్ పవర్,ఆగస్టు 24: పాత గొడవలను పురస్కరించుకుని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు రూ.50 వేలకు కిరాయికి మాట్లాడి ఇనుప రాడ్లతో దాడి చేయించిన ఘటనపై గొల్లపాలెం పోలీసులు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం.. కాజులూరు గ్రామానికి చెందిన వట్టూరి బుల్లియ్య పై హత్యాయత్నం జరిగింది,  పాత గొడవలను దృష్టిలో ఉంచుకుని బుల్లియ్యను హత్య చేయాలనే ఉద్దేశంతో కాజులూరుకు చెందిన వట్లూరి దుర్గారావు చందాల శివ సహకారంతో గంగనాపల్లి గ్రామానికి చెందిన మాన్యం గణేశ్వరరావు అలియాస్...