కెమెరా కంటితో చరిత్రకు జీవం

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 19: ఫోటోగ్రఫీ వృత్తి మాత్రమే కాదని కాలాన్ని, చరిత్రను, జ్ఞాపకాలను పదిలపరిచే అద్భుతమైన కళ అని ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు బల్లెం దుర్గాప్రసాద్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గార్ల మండల కేంద్రంలో మండల ఫోటోగ్రఫీ అసోసియేషన్ కోశాధికారి రావూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురే ను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించారు.విధి నిర్వహణలో ప్రాణాలు...