కేజీబీవీ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
గూడెంకొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 30: మండలంలోని డేరాల గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక తెలుగు వాడుక భాషా ఉద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, తెలుగు ఉపాధ్యాయురాలు జి. విజయకుమారి,ఉపాధ్యాయులు,విద్యార్థులు పుష్పాంజలి ఘటించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనం, విశిష్టత, ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. తెలుగు భాషను పరిరక్షించడంతో పాటు దాని ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న...