కొట్నాపల్లి దాహార్తికి చెక్.. కొత్త మోటార్‌తో తాగునీటి సరఫరా పునరుద్ధరణ

గూడెం కొత్తవీధి,పెన్ పవర్: ఆగస్టు 17:మండలంలోని కొట్నాపల్లి గ్రామంలో కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు మాజీ సర్పంచ్ బుజ్జిబాబు దృష్టికి తీసుకెళ్లారు.గ్రామంలో తాగునీటి సరఫరాకు కీలకంగా ఉన్న మోటార్ పనిచేయకపోవడంతో పాటు ప్యానల్ బోర్డులో కూడా సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో సమస్యను తెలుసుకున్న మాజీ సర్పంచ్ బుజ్జిబాబు వెంటనే స్పందించి కొత్త మోటార్‌తో పాటు కొత్త ప్యానల్ బోర్డును ఏర్పాటు...