గార్లలో మిన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గార్ల మండల వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పలు కార్యాలయాలను విద్యుత్ దీపాలు, రంగురంగుల అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాలను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ రక్షక...