గార్లలో రాత్రి గస్తీ.. అక్రమాలకు చెక్‌

అక్రమ రవాణా.. దొంగతనాలపై ఉక్కుపాదం గార్ల, పెన్ పవర్, ఆగస్టు 20: మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నైట్‌ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. రాత్రివేళల్లో జరిగే అక్రమ కార్యకలాపాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు భద్రత కల్పించేందుకు గార్ల–బయ్యారం సీఐ రవీందర్‌, గార్ల ఎస్సై సాయికుమార్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీసు సిబ్బంది ద్విచక్ర వాహనాలపై విస్తృతంగా గస్తీ నిర్వహిస్తున్నారు.గంజాయి రవాణా, అక్రమ గుడుంబా విక్రయాలు, దొంగతనాలు తదితర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రధాన రహదారులు, గ్రామ శివార్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు...