గార్ల ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించాలి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 14: ఎనిమిదవ వార్డు తో పాటు గ్రామంలో మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్యం, బస్సు సౌకర్యం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బీజేపీ వార్డు సభ్యురాలు భారతి ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. వార్డులో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, డ్రైనేజీలు నిర్మించాలని దంపకం బజార్ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు ఏర్పాటు చేయాలని, స్మశానవాటికలో పనిచేయని బోరును మరమ్మతు చేసి నీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి...