గోపాలపురం–డాక్య తండా బీటీ రోడ్డును వెంటనే పూర్తి చేయాలి
గార్ల, పెన్ పవర్ ఆగస్టు 6: గార్ల మండల పరిధిలోని గోపాలపురం క్రాస్ రోడ్ నుంచి డాక్య తండా వరకు నిర్మాణంలో నిలిచిపోయిన బీటీ రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ నాయకులతో కలిసి అసంపూర్తిగా ఉన్న రహదారిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరై నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వ...