ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
గార్ల, పెన్ పవర్, ఆగస్టు6: తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ శాశ్వతంగా నిలిచిపోయారని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పార్వతీ నాయక్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని గురువారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలోని జయశంకర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాల్లపెల్లి కృష్ణ గౌడ్ సర్పంచ్ పార్వతీ నాయక్ లు జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు...