ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

గార్ల, పెన్ పవర్,ఆగస్టు9: సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలంతా సంఘ టితమవ్వాల్సిన అవసరం ఉందని ఆదివాసి అధ్యక్షులు ఎట్టి రాము అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట గల కొమరం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించి ఆదివాసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో...