ఘనంగా ముందస్తు బోనాల వేడుకలు

విశ్వశాంతి విద్యాలయంలో భక్తి పారవశ్యం విద్యార్థులతో కళకళలాడిన పాఠశాల ప్రాంగణం గార్ల, పెన్ పవర్, ఆగస్టు 7: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, అమ్మవారి భక్తి సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచిన బోనాల పండుగను పురస్కరించుకుని గార్ల మండల కేంద్రంలోని స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో శుక్రవారం ముందస్తు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యాలయం ఆవరణ అంతా పండుగ శోభతో కళకళలాడగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని భక్తి భావాన్ని చాటి చెప్పారు.ఈ కార్యక్రమానికి విద్యాలయ కరస్పాండెంట్ వడ్లమూడి దుర్గాప్రసాద్, బీరవెల్లి సంజీవరెడ్డి...