ఘనంగా ముత్యాలమ్మ బోనాల వేడుకలు
ఖమ్మం పెన్ పవర్ ఆగస్టు 23 ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌ఎస్ నగర్ కాలనీలో ముత్యాలమ్మ అమ్మవారి వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో తరలివచ్చి ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో కాలనీలో ఆధ్యాత్మిక సందడి నెలకొని పండుగ వాతావరణం కనిపించింది. ఉదయం నుంచే మహిళలు బోనాల కోసం ప్రత్యేకంగా ముస్తాబై, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించి...