ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15: గార్ల మండల కేంద్రంలోని స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాలయ కరస్పాండెంట్, సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, బీరవెల్లి సంజీవరెడ్డి,లు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వాతంత్ర్య వేడుకలను ప్రారంభించారు. ప్రిన్సిపల్ పసుపులేటి రమేష్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యాలయంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి, ఉన్నత వైద్య చదువులను పూర్తి చేసుకొని ఖమ్మం పట్టణంలోని ఇండస్ ఆసుపత్రిలో ఎమ్మెస్ గ్యాస్ట్రోఎంటరాలజీ,...