చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి

మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఎనిమిది మందికి గాయాలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా సమాచారం. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు...