జూద స్థావరంపై నర్సీపట్నం పోలీసుల మెరుపు దాడి
ఆరుగురు అరెస్ట్, 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం నర్సీపట్నం, పెన్ పవర్ : అనకాపల్లి జిల్లా పోలీసు స్పెషల్ బ్రాంచ్ అందించిన సమాచారం మేరకు నర్సీపట్నం టౌన్ పోలీసులు జూద స్థావరంపై దాడి నిర్వహించారు. నర్సీపట్నం టౌన్ ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి నర్సీపట్నం పరిధిలోని కొత్త బయ్యపురెడ్డిపాలెం శివారులో ఈ దాడి చేపట్టారు. డబ్బులు పణంగా పెట్టి జూదం ఆడుతున్న ప్రదేశంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, జూదంలో పాల్గొంటున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద...