దామనపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 15: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ కేంద్రంలోని స్వర్ణ గ్రామ సచివాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.పంచాయతీ కార్యదర్శి ఆర్. లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టతను, దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను వివరించారు.ఈ కార్యక్రమంలో పీసా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కుందేరి రామకృష్ణ, కూటమి నాయకులు దుక్కెరి ప్రభాకర్,...