దేశంలో బీజేపీని గద్దె దింపే వరకు సిపిఐ పోరాడుతుంది

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 13: దేశంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకే సిపిఐ పోరాటం కొనసాగిస్తున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి అన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గార్ల మండలంలో ఆగస్టు 6న ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర వారం రోజులుగా కొనసాగుతూ గురువారం ముగింపు సందర్భంగా స్థానిక నెహ్రూ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.అన్ని వర్గాల ప్రజలపై ధరలభారం మోపుతున్న బిజెపిని మార్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు...