దేశభక్తిని పెంపొందిస్తూ పచ్చదనాన్ని పంచుతూ
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గార్ల మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలో శనివారం సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం నాయక్ ఉప సర్పంచ్ జరీనాతో కలిసి మొక్కలు నాటారు. ప్రజలకు నిత్యం సేవలందిస్తూ గ్రామ పరిశుభ్రత పారిశుధ్య పరిరక్షణలో కీలకంగా పని చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్మికులను ఆమె అభినందించారు. సిబ్బంది సంక్షేమానికి తమ వంతుగా ప్రాధాన్యతతో పాటు వారి అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి సహకారం అందిస్తామని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది కి నిత్యావసర...