నర్సీపట్నం మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో పద్మావతి ముమ్మర పర్యటన

21, 22, 23 వార్డుల్లో రూ. 1.94 కోట్ల పనులకు శ్రీకారం... నర్సీపట్నం, పెన్ పవర్: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 21, 22, 23వ వార్డుల్లో నూతనంగా మంజూరైన అభివృద్ధి పనులను  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి, శిలాఫలకాలను ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు. ఆయా వార్డుల్లో పర్యటించిన ఆమెకు స్థానిక ప్రజలు, మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. VMRDA, 15వ ఆర్థిక సంఘం, DMFT నిధుల ద్వారా ఈ మూడు...