నీట్‌లో ప్రతిభ.. ఎస్టీ కేటగిరీలో రాష్ట్ర 14వ ర్యాంక్:ఘనంగా సన్మానించిన వైసిపి నేత బొబ్బిలి లక్ష్మణ్
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగష్టు 28:అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెదబరడ గ్రామానికి చెందిన పాంగి ఆనంద్‌కుమార్ నీట్ పరీక్షలో 499 మార్కులు సాధించి ఎస్టీ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో 14వ ర్యాంక్ సాధించాడు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించి వైద్య విద్యలో సీటు పొందడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.పాంగి బాబూరావు మాస్టర్, దేవుడమ్మ దంపతుల కుమారుడైన ఆనంద్‌కుమార్ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కష్టపడి చదివి నీట్‌లో...