నేతాజీ అడుగుజాడల్లో యువత నడవాలి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 18: యూఎస్‌ఎఫ్ఐ, గార్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఈ సందర్భంగా యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాళోత్ శాంతికుమార్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో తనదైన ముద్ర వేసిన మహోన్నత నాయకుడని అన్నారు. సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ఆయన ప్రదర్శించిన ధైర్యం, పట్టుదల, త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు....