పంజాల ఐలయ్యకు జాతీయ సమైక్యత అవార్డు

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 16: మహబూబాబాద్ జిల్లా గార్ల కు చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు, కవి రచయిత పంజాల ఐలయ్యకు వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు-2026 లభించింది. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆనందలహరి సంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సాహిత్య రంగంలో చేస్తున్న కృషికి గాను జాతీయ సమైక్యత పురస్కారానికి ఎంపిక చేశారు. ముఖ్య అతిథులు ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, వంశీ ఇంటర్నేషనల్...