పదవీ విరమణ ఉద్యోగానికే.. సేవాభావానికి కాదు: మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం, పెన్ పవర్ ఆగస్టు 31 : ఉపాధ్యాయులతోనే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, గురువును మించిన దైవం లేరని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ, పదవీ విరమణ అనేది ఉద్యోగానికే తప్ప వ్యక్తిత్వానికి, సేవాభావానికి కాదని పేర్కొన్నారు. మనిషి సంపాదించుకున్న మంచి పేరు, సమాజానికి అందించిన సేవలు, చేసిన మంచిపనుల ప్రభావం శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. రామచంద్రపురం రూరల్ మండలం నరసాపురపుపేట...