పరిశుభ్రతే లక్ష్యంగా.. ఆధునిక పరికరాలు

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 12: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గార్ల మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, పచ్చదనం పరిరక్షణకు అవసరమైన నూతన అత్యాధునిక పరికరాలను పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. పంచాయతీ ఆవరణలో బుధవారం నూతన పరికరాలను సర్పంచ్‌ పార్వతి హతిరాం నాయక్ ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం చేసేందుకు రెండు ఫాగింగ్‌ మిషన్లు, రెండు తైవాన్ పవర్‌ స్పేర్‌ పంపులు, రెండు గ్రాస్‌ కటింగ్‌ మిషన్లు, 16...