పాకాల సమీపంలో అరుదైన ‘బ్యాండెడ్ క్రైట్’ కలకలం

నర్సంపేట పెన్ పవర్ ఆగస్టు 12: నర్సంపేట పాకాల సమీపంలోని అశోక్‌నగర్‌లో అరుదైన, అత్యంత విషపూరితమైన ‘బ్యాండెడ్ క్రైట్’ పాము కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నలుపు, పసుపు రంగు చారలతో ప్రత్యేకంగా కనిపించిన ఈ పామును కొందరు యువకులు గుర్తించారు.సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాష్ అప్రమత్తంగా వ్యవహరించారు. పాముకు ఎలాంటి హాని కలగకుండా, తమకు ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ దానిని సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం పాకాల అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.విషయం తెలుసుకున్న ఎఫ్‌ఎస్‌ఓ ధర్మతో...