పాత మొబైల్.. కొత్త గిఫ్ట్.. అసలు కథేంటి?
స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ నుంచి దుప్పట్లు, ఇంటి సామాన్ల వరకు.. ఆఫర్ల పేరుతో పాత ఫోన్ల సేకరణ సోషల్ మీడియాలో ప్రచారం.. ఇంటింటికీ తిరుగుతూ గిఫ్ట్‌ల ఎర.. చిలకలూరిపేటలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం చిలకలూరిపేట : “మీ దగ్గర పాత మొబైల్ ఉందా..? మా వద్దకు తీసుకురండి.. స్మార్ట్‌వాచ్ ఉచితంగా పొందండి.. ఇయర్‌బడ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, దుప్పట్లు, ఇంటి అవసరాలకు ఉపయోగపడే సామాన్లు.. ఇలా రకరకాల గిఫ్ట్‌లు పొందండి..” అంటూ సాగుతున్న ప్రచారం చిలకలూరిపేటలో చర్చనీయాంశంగా మారింది. పాత మొబైల్ ఫోన్లను గిఫ్ట్ ఆఫర్లతో...