పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి: పన్యాల జైపాల్ రెడ్డి

ఎల్బీనగర్, పెన్ పవర్, ఆగస్టు 18: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న ను స్ఫూర్తిగా తీసుకోవాలని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఉన్న పాపన్న విగ్రహానికి జైపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన పోరాటయోధులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. బహుజన విప్లవ వీరుడు...