ప్రజా ఆకాంక్షలే పరమావధిగా పాలన : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
*కూసుమంచి మండలంలో రూ.6.74 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన* ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 6: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి కూసుమంచి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల పురోగతే లక్ష్యంగా రూ.6.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న...