ప్రజా సమస్యలపై గళమెత్తిన సర్పంచులు
సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల ఆగ్రహం వైద్యం నుంచి తాగునీరు, విద్యుత్ వరకు పలు అంశాలపై నిలదీత అధికారుల సమన్వయ లోపంపై అసంతృప్తి గార్ల, పెన్ పవర్, ఆగస్టు 20: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి జి. దేశీరామ్ నాయక్ అన్నారు. గురువారం గార్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన సర్పంచులు, కార్యదర్శులు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక మండల...