ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 24: ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి పరిష్కరించడమే ప్రజావాణి లక్ష్యమని ఎంపీడీవో మంగమ్మ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి దరఖాస్తులు అందజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ...