ప్రారంభమైన ప్రజావాణి సమస్యలపై వినతుల వెల్లువ

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 17: గార్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కరించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, సంక్షేమ పథకాలు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీలు తదితర సమస్యలపై ప్రజలు వినతిపత్రాలను సమర్పించారు.ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించి,...