ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శం
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శప్రాయమని ప్రిన్సిపల్ డాక్టర్ డి రాజు అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యార్థులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజు మాట్లాడుతూ...