ప్రొఫెసర్ జయశంకర్ ను ఆదర్శంగా తీసుకోవాలి

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు6: తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తొలి ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనంత రాములు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి పురస్కరించుకొని గురువారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలోని జయశంకర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...