బుద్ధారం, డాక్య తండాలకు బీటీ రోడ్లు నిర్మించాలి

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 17: బుద్ధారం అండర్‌గ్రౌండ్‌ నుంచి బుద్ధారం గ్రామం వరకు, అలాగే గోపాలపురం నుంచి డాక్య తండా వరకు బీటీ రోడ్లు నిర్మించాలని సీపీఐ గార్ల మండల సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గార్ల మండల కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో ప్రత్యేక నోడల్ అధికారిగా వ్యవహరించిన ఎంపీడీవో మంగమ్మ కు వినతిపత్రం అందజేశారు. అనంతరంఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ బుద్ధారం డాక్య తండా గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు, వాహనదారులు...