భక్తి శ్రద్ధలతో తీజ్​ వేడుకలు

ఆకట్టుకుంటున్న సంప్రదాయ నృత్యాలు గార్ల, పెన్ పవర్, ఆగస్టు 16: గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దేశ్య తండాలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న తీజ్ పండుగ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగాయి. తీజ్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా గిరిజన భక్తజనం సంత్ సేవాలాల్ మహారాజ్, మేరమా యాడీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని, గ్రామాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, పెళ్లికాని యువతీ యువకులకు మంచి సంబంధాలు కుదరాలని, ప్రపంచ శాంతి...