మాతృభాష వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచాలి
పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేతనం పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం సేవలందిస్తున్నా.. కనీస ఆదాయానికి నోచుకోని దుస్థితి గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 22:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు వారి మాతృభాషలో విద్యాబోధన చేస్తూ గిరిజన విద్యాభివృద్ధికి కీలకంగా సేవలందిస్తున్న మాతృభాషా విద్యా వాలంటీర్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం తక్షణమే పెంచాలని గూడెం కొత్తవీధి మండల మాతృభాషా ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు, బొర్రామామిడి ఎంపీపీ పాఠశాల మాతృభాషా వాలంటీర్ గెమ్మెల లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్...