మున్నేరు నీటిని తరలించే కుట్రను అడ్డుకోవాలి

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 25: మున్నేరు నీటిని పాలేరు వైపు తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్‌ రైతులను కోరారు. మున్నేరు పాలేరు లింక్‌ కెనాల్‌ పేరుతో రైతులను మభ్యపెట్టి రహస్యంగా సంతకాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పూర్తి వివరాలు తెలియజేయకుండా ఇప్పటికే పలువురు సంతకాలు చేశారని మీరూ చేయండి అంటూ కొందరు సంతకాలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పత్రంపైనైనా సంతకం...