మేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 1,000 చొప్పున కుట్టుమిషన్లను 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మేరు కులస్తులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని మేరు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వరరావు కోరారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం జరగనున్న...