రాంపురంలో వైభవంగా ముత్యాలమ్మ బోనాలు

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 12: గార్ల మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఆరాధ్య దేవత ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను బుధవారం భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా గ్రామంలోని మహిళలు ప్రత్యేకంగా అలంకరించుకుని బోనాలను నెత్తిన ఎత్తుకుని మేళతాళాలు, డప్పుచప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరసారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రాంపురం గ్రామ సర్పంచ్ బాదావత్ సరోజినీ రవి నాయక్ లు అమ్మవారికి...