రామచంద్రపురంలో ఘనంగా హితేష్ గురు తొలి పుట్టినరోజు వేడుకలు

రామచంద్రపురం, పెన్ పవర్, ఆగస్టు 20: కాజులూరు ఎంపీడీవో జాగరపు రాంబాబు–సహజ దంపతుల కుమారుడు హితేష్ గురు తొలి పుట్టినరోజు వేడుకలు గురువారం రామచంద్రపురంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారి హితేష్‌ జన్మదిన వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ వేడుకల్లో పాల్గొని చిన్నారి హితేష్‌ను ఆశీర్వదించి శుభాకాంక్షలు...