రైతుల తీర్పును ఎదుర్కోండి మాజీ ఎంపిటిసి రమేష్

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 10: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలకు ప్రభుత్వం దూరంగా ఉండటంపై బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీటీసీ శీలం శెట్టి రమేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల ఓటు హక్కును పక్కనపెట్టి నామినేటెడ్‌ విధానంలో పదవులను భర్తీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. రైతులపై నమ్మకం ఉంటే ఎన్నికలు నిర్వహించి వారి తీర్పును స్వీకరించాలని సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను కాపాడటంలో...