వంచులలో వైసీపీకి బలం

కూటమి నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరిక గూడెంకొత్తవీధి,పెన్ పవర్ ఆగస్టు 27:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశంలో వంచుల పంచాయతీకి చెందిన పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వనపల రాజేష్‌, సీనియర్‌ నాయకుడు లొంజా గణపతి ఆధ్వర్యంలో వారు పాడేరు ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పార్టీ కండువాలు కప్పి...