వరి పంట వేసిన రైతులందరూ భీమా చేయించుకోండి

వరి పంట బీమా పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక సూచనలు క్షేత్రస్థాయిలో రైతులకు చెప్పి పంట బీమా చేయించాలని నాయకులకు పిలుపు నర్సీపట్నం, పెన్ పవర్ : ​ఈ ఏడాది ఎల్ నీనో వాతావరణ ప్రభావం వల్ల వర్షాలు సరిగ్గా కురవక వరి పంటకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి వరి సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకే ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని...