వర్షంలోనే వార్డుల బాట పట్టిన మంత్రి పొంగులేటి
ఏదులాపురంలో క్షేత్రస్థాయి పర్యటన.. ప్రజల సమస్యలపై నేరుగా ఆరా రూ.100 కోట్ల నిధులతో మోడల్ మున్సిపాలిటీగా ఏదులాపురం రూపకల్పన ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 7: వర్షం కురుస్తున్నా వెనుకడుగు వేయలేదు. గొడుగు పట్టుకుని నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. వార్డుల వీధుల్లో కాలినడకన పర్యటిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌తో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్,...