వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు1: వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి గుగులోతు దేశీరాం అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం విపత్తు నిర్వహణపై వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనులు, ప్రజలకు రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఎక్కడైనా పైప్‌లైన్‌ లీకేజీలు ఏర్పడితే వెంటనే సరిచేసుకోవాలన్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం...