విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం: డి.ఎస్.పి సిహెచ్ తిరుమలరావు

గూడెంకొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 19: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్‌.తిరుమలరావు సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను బుధవారం డీఎస్పీ సందర్శించారు. గూడెంకొత్తవీధి సీఐ బి.సుధాకర్‌, ఎస్సై కె.సురేష్‌లతో కలిసి విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోక్సో చట్టం, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఆన్‌లైన్‌ మోసాలు, అనుమానాస్పద లింకులు, తెలియని...