విద్యార్థుల ఆగ్రహానికి గురైతే.. అధికారం గల్లంతే

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 20: విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదని  ‘శక్తి’ స్కీమ్, జీవో 97ను వెంటనే రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపాలిటెక్నిక్ విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయడానికి...