విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
సీఐటీయూ ఆధ్వర్యంలో నాలుగు గంటల ఆందోళన. రూ.27 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై హామీ చింతూరు, పెన్ పవర్, ఆగస్టు 11: ఏపీ జెన్‌కో మోతుగూడెం పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడు గూడూరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్యగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మడివి ముత్తయ్య ఏపీ జెన్‌కో డిస్ట్రిబ్యూషన్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం విధి నిర్వహణలో భాగంగా పవర్‌హౌస్ నుంచి పోలూరు...